
గాసిప్స్

2026 పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. సోమవారం పూల్-ఈ చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో టీమిండియా 3-5 తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ ఆరంభమైన 39 సెకన్లకే జోక్విన్ టొస్కానీ గోల్ చేయగా, నికోలస్ డి లా టొర్రే మరో గోల్‌తో అర్జెంటీనాకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం సుఖ్‌జీత్ సింగ్ గోల్‌తో భారత్ పోటీలోకి వచ్చింది.
అయితే అర్జెంటీనా ఆధిక్యాన్ని కొనసాగిస్తూ మ్యాచ్‌ను 5-3తో సొంతం చేసుకుంది. దీంతో పూల్-ఈలో చివరి స్థానంతో నిలిచిన భారత్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. టోర్నీ కొత్త ఫార్మాట్ ప్రకారం పూల్‌లో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ఏడో స్థానం కోసం భారత్ శుక్రవారం సహ ఆతిథ్య దేశం బెల్జియంతో తలపడనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!