
గాసిప్స్

ఇంగ్లండ్ స్టార్ బౌలర్ బ్రైడన్ కార్స్ నైట్‌క్లబ్ ఘటనతో వార్తల్లో నిలిచాడు. డెర్బీలోని ఓ క్లబ్ వెలుపల కార్స్‌ను పోలీసులు చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డర్హామ్ జట్టు తరఫున డెర్బీషైర్‌పై విజయం సాధించిన అనంతరం జట్టు సభ్యులు సంబరాల్లో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
అయితే కార్స్‌ను అరెస్టు చేయలేదని, కొద్దిసేపు అదుపులోకి తీసుకున్న అనంతరం ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండా విడుదల చేసినట్లు స్థానిక పోలీసు సమాచారం పేర్కొంది. ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు పాకిస్థాన్‌తో రెండో టెస్టుకు కార్స్ అందుబాటులో ఉండడని ఈసీబీ వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!