
బిజినెస్

ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి తర్వాత నిరాశలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు మరో అనుకోని ఘటన ఎదురైంది. ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తున్న జట్టు బస్సులో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనను గమనించిన వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అప్రమత్తమై బస్సు నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో జట్టు సభ్యులు దాదాపు గంటసేపు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం నిర్వాహకులు మరో బస్సు ఏర్పాటు చేసి ఆటగాళ్లు, సిబ్బందిని క్షేమంగా హోటల్‌కు తరలించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం ఊరటనిచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!