
జనరల్

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో జూలై 19న (స్థానిక కాలమానం ప్రకారం) డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో లియోనెల్ మెస్సీ, స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ తొలిసారి ఒకరినొకరు మైదానంలో ఎదుర్కోనుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఫైనల్కు ముందు యునిసెఫ్ 18 ఏళ్ల క్రితం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో తీసిన అరుదైన ఫొటోను పంచుకుంది. ఆ ఫొటోలో యువ మెస్సీ ఒడిలో చిన్నారి లామిన్ యమాల్ ఉండగా, అతని తల్లి షీలా కూడా కనిపించారు. ప్రస్తుతం మెస్సీ, యమాల్ ఇద్దరూ యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్లుగా సేవలందిస్తూ చిన్నారుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తుండటం ఈ ఫొటోకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!