
సినిమాలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె రెండోసారి తల్లికాబోతున్న నేపథ్యంలో కూడా షూటింగ్‌లలో పాల్గొంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే ఆమెకు ఒక కూతురు ఉండగా, ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పటికీ ‘రాకా’ సినిమా షూటింగ్‌లో ప్రతిరోజూ పాల్గొంటున్నట్లు సమాచారం. ప్రసూతి సెలవులకు వెళ్లేలోపు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఆమె కట్టుబాటుతో పనిచేస్తోంది.
ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాడుతున్నప్పటికీ, దీపికా రాత్రి షిఫ్టుల్లో పని చేయడమే కాకుండా, గాల్లో ఫైట్స్ వంటి కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ మేకర్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ఆమె అంకితభావం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ చిత్రం 2027లో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!