
గాసిప్స్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026 సీజన్‌ను తెలుగు వారియర్స్ జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. కెప్టెన్ అక్కినేని అఖిల్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో శనివారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్‌పై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఖిల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అఖిల్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అశ్విన్‌బాబు 51 బంతుల్లో 60 పరుగులతో కీలక సహకారం అందించాడు. లక్ష్య ఛేదనలో పంజాబ్ దే షేర్ 18.2 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వినయ్ మహదేవ్ మూడు వికెట్లు పడగొట్టగా, సామ్రాట్ రెండు వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!