

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 31వ రోజు భావోద్వేగాలు, వివాదాలు, టాస్క్‌లతో ఆసక్తికరంగా సాగింది. వర్షిణి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను త్రిగుణ్‌తో పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది. చిన్నప్పటి నుంచి తల్లితోనే పెరిగానని, తండ్రి తనకు అందుబాటులో లేకపోవడంతో ఆయన ప్రేమ, ఆప్యాయతను పొందలేకపోయానని చెప్పింది. తండ్రి లేని లోటు తనలో చాలా కాలంగా భావోద్వేగ భారంగా మిగిలిపోయిందని వర్షిణి తెలిపింది.
ముకేశ్‌తో తనకున్న సన్నిహిత అనుబంధంపై కూడా వర్షిణి స్పష్టత ఇచ్చింది. తమ మధ్య ప్రేమ బంధం లేదని, ముకేశ్ చేయి పట్టుకున్నప్పుడు తనకు భద్రత, ధైర్యం కలిగినట్లు అనిపిస్తుందని చెప్పింది. మరోవైపు దేబ్జానీ, వంశీ కలిసి అపూర్వ ప్రవర్తనపై చర్చించారు. డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్ల కోసం నిర్వహించిన టాస్క్‌లో చరణ్–అపూర్వ జోడీ విజయం సాధించింది. త్రిగుణ్–అమన్, ఝాన్సీ–ముకేశ్, నరేష్–రామ్ ప్రసాద్, రోహిత్–షాలిని జంటలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!