

టెలివిజన్ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి వర్షిణి వెంకట్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్ ఫిలిమ్ నిర్మించబోతున్నానని, అందులో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి తన నుంచి రూ.5 లక్షలు తీసుకున్నారని ఓ యువకుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
డబ్బులు తిరిగి అడిగిన సమయంలో గిండి ప్రాంతంలో తనను బెదిరించడంతో పాటు రూ.50 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు తీసుకున్నారని బాధితుడు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వర్షిణి వెంకట్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో నమోదైన ఆరోపణలు దర్యాప్తు పరిధిలోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!