

బిగ్‌బాస్ తెలుగు 10 తొమ్మిదో వారం నామినేషన్స్‌లో వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఈ వారం వర్షిణి ప్రధాన టార్గెట్‌గా మారింది. గత వారం జరిగిన హోటల్ టాస్క్‌లో డబ్బుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఆమె నరేష్‌ను నామినేట్ చేసింది. ఝాన్సీ డబ్బులు అడిగినప్పుడు నరేష్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దేబ్జానీ చెప్పిన మాటలు విని నరేష్ నిర్ణయం తీసుకున్నాడని, ఇతరుల ప్రభావంతో గేమ్ ఆడుతున్నాడని ఆరోపించింది. దీనికి నరేష్ గట్టిగా స్పందించాడు. డబ్బులు తనవని, వాటిని ఎవరికి ఇవ్వాలి, ఎలా ఖర్చు చేయాలి అనేది తన ఇష్టమని స్పష్టం చేశాడు. అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తనను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. అంతేకాకుండా రోహిత్, ముఖేష్ కోసం వర్షిణి కూడా ఆడుతోందని కౌంటర్ ఇచ్చాడు.
మరోవైపు రామ్ ప్రసాద్ కూడా వర్షిణిని నామినేట్ చేస్తూ ఆమె ఆటతీరుపై విమర్శలు చేశాడు. బయటకు ఒకలా కనిపిస్తూ, లోపల మరోలా ఆలోచిస్తుందని, తన ప్రయోజనాల కోసం నరేష్‌ను ఉపయోగించుకుందని ఆరోపించాడు. హోటల్ టాస్క్‌లో నరేష్‌తో కలిసి గ్రీన్ జోన్‌కు వెళ్లాలని ప్లాన్ చేసిందని, తాను వెళ్లలేకపోవడంతో ఇప్పుడు అతనిపై విమర్శలు చేస్తోందని అన్నాడు. దీనికి వర్షిణి స్పందిస్తూ నరేష్ మాత్రమే గ్రీన్ జోన్‌లోకి వెళ్లాడని, తాను వెళ్లలేదని చెప్పింది. అయితే ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకున్నారని, నరేష్ సహాయంతోనే వర్షిణి కూడా సేవ్ అవ్వాలని చూసిందని రామ్ ప్రసాద్ తిరిగి ప్రశ్నించాడు. ఈ పరిణామాలతో నామినేషన్స్‌లో వర్షిణి ఒంటరిగా మిగిలినట్లు కనిపించింది. హోటల్ టాస్క్‌లోని డబ్బుల వ్యవహారం ఈ వారం నామినేషన్స్‌లో ప్రధాన వివాదంగా మారింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!