

బిగ్‌బాస్ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా మారింది. ఈ వారం షాలినీ పటేల్, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రామ్ ప్రసాద్, ముఖేష్ గౌడ, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్ నామినేషన్స్‌లో ఉన్నారు. అమన్, వంశీ, నరేష్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. దీంతో ఎలిమినేషన్ రేసులో ఉన్న 11 మంది మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
అందుబాటులో ఉన్న అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ అతడికి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖేష్ గౌడ మూడో స్థానంలో, ఆటో రామ్ ప్రసాద్ నాలుగో స్థానంలో ఉన్నట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి. సుధీర్, షాలినీ, దేబ్జానీ తర్వాతి స్థానాల్లో ఉండగా, సృష్టి, ఝాన్సీ, వర్షిణి, కృష్ణుడు దిగువ స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఓటింగ్ పూర్తయ్యే వరకు ట్రెండ్స్ మారే అవకాశం ఉంది. కాబట్టి ఎలిమినేషన్‌పై తుది నిర్ణయం అధికారిక ఫలితాల తర్వాతే వెల్లడవుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!