

సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున జైలు నుంచి విడుదలైన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అప్పటి పాలకులు సహించలేకపోయారని, నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో అర్ధరాత్రి అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఆ 53 రోజులు అత్యంత కఠినమైనవని తెలిపారు. కోట్లాది ప్రజల మద్దతు, తిరుగుబాటుతో అప్పటి పాలకుల కుట్రలు బద్దలయ్యాయని వ్యాఖ్యానించారు. తనపై చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటానని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు జైలు నుంచి విడుదలైన రోజును జీవితంలో మర్చిపోలేని రోజుగా మంత్రి నారా లోకేశ్ అభివర్ణించారు. నిజం గెలిచిన రోజు, న్యాయం జరిగిన రోజుగా పేర్కొన్నారు. తప్పుడు కేసులో అరెస్టయిన చంద్రబాబు 53 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఆనందించారని తెలిపారు. ప్రజల జేజేల మధ్య ఆయన జైలు నుంచి బయటకు వచ్చారని, రాజకీయ కక్షతోనే అప్పట్లో చంద్రబాబును నిర్బంధించారని లోకేశ్ పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!