

బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారం నామినేషన్ ప్రక్రియలో మరోసారి హీట్ పెరిగినట్టుగా తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా సుధీర్, శ్రిష్టి మధ్య వ్యవహారం తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు కనిపిస్తోంది. త్రిగుణ్‌తో సుధీర్ తన గేమ్ గురించి చర్చించినట్లు, శ్రిష్టితో క్లోజ్ ట్రాక్‌ను ప్రారంభించే ప్రయత్నం చేసినట్లు ప్రోమోలో హింట్ ఇచ్చారు. అయితే మొదటి నుంచీ సుధీర్‌ను శ్రిష్టి దూరంగా ఉంచుతూనే వచ్చింది. నామినేషన్స్ సమయంలో సుధీర్ వ్యవహారశైలిపై శ్రిష్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాను సుధీర్‌కు ఫ్రెండ్‌నా కాదా అని శ్రిష్టి ప్రశ్నించగా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సుధీర్ వర్షిణిని పిలవడంతో శ్రిష్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన గురించి, ఇతర కంటెస్టెంట్ల గురించి సుధీర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ప్రశ్నించింది. ఇదంతా తన గేమ్ స్ట్రాటజీలో భాగమేనని సుధీర్ చెప్పగా.. అబద్ధాలు ఆడటమే నీ గేమా? అంటూ రోహిత్ ప్రశ్నించాడు. తాను మొదటి నుంచీ సుధీర్ తన టైప్ కాదని చెబుతున్నానని శ్రిష్టి స్పష్టం చేసింది. మాటల తీవ్రత పెరగడంతో ఆమె భావోద్వేగానికి గురై షాలినీ వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు త్రిగుణ్‌ను సుధీర్ మానిప్యులేటర్‌గా అభివర్ణించగా, త్రిగుణ్ కూడా ఘాటుగా స్పందించాడు. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో పూర్తి ఎపిసోడ్‌లో చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!