

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నిన్నటి ఎపిసోడ్‌లో ఫ్యామిలీ వీక్ కోసం జరిగిన పోటీలు, వాగ్వాదాలు, భావోద్వేగాలు ఆసక్తికరంగా సాగాయి. ఒక టాస్క్ ముగిసిన తర్వాత త్రిగుణ్‌తో నీతూ మాస్టర్ గొడవకు దిగింది. వంశీతో కలిసి మాట్లాడాలని చెప్పి తనను తప్పుదారి పట్టించారని ఆమె ఆరోపించింది. మరోవైపు, గతంలో జరిగిన టాస్క్‌లో వంశీ ఫ్యామిలీ వీక్ అవకాశాన్ని దక్కించుకున్నాడు. టాస్క్‌లో భాగంగా వర్షిణి తన కుటుంబ ఫొటోను క్రష్ చేయాల్సి రావడంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇదిలా ఉండగా, అమన్ తన రివేంజ్ లిస్టులో త్రిగుణ్ పేరు చేర్చడంతో అతడు తీవ్రంగా బాధపడ్డాడు. తన కూతురు హౌస్‌లోకి వస్తే మొదట స్వాగతించే వ్యక్తిగా అమన్‌ను ఊహించుకున్నానని శివ, నరేశ్‌ల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు.
అనంతరం త్రిగుణ్, దేబ్జానీ, రాంప్రసాద్, నరేశ్, శివ బాస్కెట్‌బాల్ టాస్క్‌లో పాల్గొన్నారు. శివతో జరిగిన ఉత్కంఠభరిత పోటీలో చివరి ప్రయత్నంలో విజయం సాధించిన త్రిగుణ్ ఫ్యామిలీ వీక్‌కు అర్హత పొందాడు. మరో టాస్క్‌లో నరేశ్, నీతూ మాస్టర్‌లను ఓడించిన దేబ్జానీ రివేంజ్ పవర్‌ను దక్కించుకుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముకేశ్‌ను ఫ్యామిలీ వీక్‌కు దూరం చేసింది. దీనిపై ముకేశ్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ, దేబ్జానీ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వస్తే తానే వెళ్లి స్వాగతిస్తానని చెప్పాడు. ఎపిసోడ్ చివర్లో వంశీ, దేబ్జానీ, శ్వేత, త్రిగుణ్ నామినేషన్ల నుంచి సేవ్ అయినట్లు ప్రకటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!