

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ భావోద్వేగాలు, వాదోపవాదాల మధ్య కొనసాగింది. త్రిగుణ్ తనను నామినేట్ చేయడంపై వర్షిణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరేళ్లుగా స్నేహితులుగా ఉన్న తమ మధ్య ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఆమె ఆవేదన చెందింది. ఆట కోసమే నామినేషన్ చేశానని త్రిగుణ్ స్పష్టం చేశాడు. స్నేహితుడిగా విఫలమై ఉండొచ్చని, కానీ ఆటలో గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు. తన కుటుంబమే తనకు మొదటి ప్రాధాన్యమని కూడా వివరించాడు.
ఇతర కంటెస్టెంట్ల మధ్య కూడా ఆటతీరు, కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రవర్తనపై వాదనలు జరిగాయి. నరేష్ వర్షిణి, ఝాన్సీలను నామినేట్ చేయగా, వర్షిణిపై చేసిన ఆరోపణలు ఆమోదం పొందాయి. శివకుమార్ సుధీర్ రెడ్డి, వంశీలను నామినేట్ చేస్తూ సుధీర్ కెప్టెన్సీపై విమర్శలు చేశాడు. రామ్ ప్రసాద్ శివకుమార్‌ను, శ్వేత దేబ్జానీతో పాటు ఝాన్సీని, రోహిత్ నరేష్‌ను, రామకృష్ణ వర్షిణిని నామినేట్ చేశారు. సింగర్ ఝాన్సీ కూడా శివకుమార్‌ను నామినేట్ చేసింది. రెడ్ జోన్ నుంచి వంశీ నామినేషన్లోకి వచ్చాడు. దీంతో ఈ వారం ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్ రెడ్డి, రామ్ ప్రసాద్, వర్షిణి, శివకుమార్, వంశీ నామినేషన్లలో ఉన్నారు. వీరిలో ఎవరు ప్రేక్షకుల మద్దతుతో సురక్షితంగా ఉంటారో, ఎవరు ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటారో రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!