

డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి మోసాలను ‘డిజిటల్ దోపిడీ’గా అభివర్ణించిన ధర్మాసనం.. నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. డిజిటల్ మోసాలకు సంబంధించి దేశవ్యాప్తంగా తమపై నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ ఒకచోటకు చేర్చాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నిందితుల సౌలభ్యం కోసం బాధితులకు ఇబ్బందులు కలిగించలేమని స్పష్టం చేసింది.
వీడియో కాల్స్ ద్వారా నిందితులు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టం పరిధిలో సాధ్యమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు అవసరమని అభిప్రాయపడింది. విచారణ పూర్తికాకముందే శిక్ష విధించేందుకు చట్టంలో అవకాశం ఉంటే వినియోగించాలని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే, ఎలాంటి చర్యలైనా చట్టబద్ధమైన ప్రక్రియకు అనుగుణంగానే ఉండాలి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!