

బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. ఈసారి గ్రీన్ లెవల్‌లో ఉన్నవారితో పాటు ఎల్లో లెవల్‌లో ఉన్న ముగ్గురికి కూడా నామినేషన్లు చేసే అవకాశం కల్పించారు. అయితే ఆ ముగ్గురు ఎవరనేది వారు చేసే వాదనలు, చెప్పే పాయింట్ల ఆధారంగా జడ్జీలు నిర్ణయిస్తారని ప్రకటించడంతో హౌస్‌లో ఆసక్తి పెరిగింది. పర్మినెంట్ జడ్జీ, రోటేటింగ్ జడ్జీ అంటూ కొత్తగా ఏర్పాట్లు చేయడంతో పోటీదారుల మధ్యే కాకుండా జడ్జీల మధ్య కూడా టెన్షన్ నెలకొంది. ఎల్లో టీమ్ నుంచి మొదట నరేష్‌ను ఎంపిక చేయగా, అతను వర్షిణి, ఝాన్సీలను నామినేట్ చేశాడు. టాస్కులు సరిగ్గా ఆడటం లేదని నరేష్ ఆరోపించగా, వర్షిణి ఘాటుగా స్పందించింది. ఇది కేవలం గేమ్ షో కాదని, పర్సనాలిటీ షో అని చెబుతూ టాస్కులు గెలిచినంత మాత్రాన విజేతలు కాలేరని పేర్కొంది. ఇటీవలే తనకు శస్త్రచికిత్స జరిగిందని, లేకపోతే టాస్కుల్లో మరింత మెరుగ్గా ఆడేదాన్నని వివరించింది.
ఈ చర్చలో జడ్జీగా ఉన్న త్రిగుణ్ కలుగజేసుకుంటూ, తమ వాదనలకు మద్దతుగా ఇతరులను సాక్షులుగా తీసుకురావచ్చని చెప్పాడు. శివ్ స్పందిస్తూ, టాస్కుల ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని చూపించవచ్చని అన్నాడు. దీనిపై వర్షిణి అతనికి కామన్ సెన్స్ లేదంటూ కౌంటర్ ఇచ్చింది. అనంతరం ఝాన్సీ ఏడుస్తుందనే కారణంతో నరేష్ ఆమెను నామినేట్ చేశాడు. శివ్ సుధీర్, వంశీలను నామినేట్ చేయగా, జడ్జీలు సుధీర్‌ను డేంజర్‌లో పెట్టారు. రాంప్రసాద్ శివ్, శ్వేతలను నామినేట్ చేయగా, శివ్ డేంజర్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత రెడ్ టీమ్ నుంచి ఒక్కరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వగా, రోహిత్ నరేష్‌ను, రామకృష్ణ వర్షిణిని నామినేట్ చేశారు. దీంతో వర్షిణి డేంజర్‌లోకి వెళ్లింది. చివరగా ఝాన్సీ, శ్వేతలు శివ్, ఝాన్సీలను నామినేట్ చేయగా, శివ్ సేవ్ అయ్యాడు. రెండు రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియ ముగిసేసరికి ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రాంప్రసాద్, వర్షిణి, శివ్, వంశీ నామినేషన్లలో నిలిచారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!