

కాక్రొచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మరోసారి తెలిపారు. నాగ్‌పుర్‌లో మాట్లాడిన ఆయన.. దీప్కే అంబేడ్కర్ భావజాలాన్ని అనుసరించే యువ నాయకుడని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు యువ నాయకుల భాగస్వామ్యం అవసరమని అన్నారు. దీప్కే తమతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటే స్వాగతిస్తామని చెప్పారు. అయితే, ఈ ఆహ్వానంపై దీప్కే ఇంకా అంగీకారం తెలిపినట్లు సమాచారం లేదు.
ఇంతకుముందు ఆగస్టులోనూ అథవాలే ఇలాంటి ఆహ్వానం ఇవ్వగా, తనను గతంలో ‘దేశద్రోహి’గా అభివర్ణించినవారే ఇప్పుడు తమ కూటమిలోకి రావాలని ఆహ్వానిస్తున్నారంటూ దీప్కే వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని, ప్రజా సమస్యలను లేవనెత్తే ఒత్తిడి సమూహంగా CJPని కొనసాగించాలనుకుంటున్నారని ఆయన గతంలో స్పష్టం చేశారు. విద్య, నిరుద్యోగం, ప్రజా సమస్యలపై ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపైనే ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. అథవాలే తాజా ఆహ్వానంపై దీప్కే వైఖరి ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!