

బిగ్‌బాస్ తెలుగు 10లో ఎనిమిదో వారం బీబీ హోటల్ టాస్క్ సందడి మొదలుకానుంది. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇంటిని హోటల్‌గా మార్చేశారు. కంటెస్టెంట్లను మూడు జోన్లుగా విభజించి, ఒక్కో గ్రూప్‌కు ఒక్కో బాధ్యత అప్పగించారు. రెడ్ జోన్‌లో ఉన్నవారు హోటల్ సిబ్బందిగా సేవలు అందించాలి. వారి పనితీరు నచ్చిన అతిథులు టిప్స్ రూపంలో డబ్బులు ఇవ్వొచ్చు. ఎల్లో జోన్ సభ్యులు హోటల్ యజమానులుగా వ్యవహరించనుండగా, గ్రీన్ జోన్ సభ్యులు అతిథులుగా కనిపించనున్నారు. హోటల్ యజమానుల ఆతిథ్యం నచ్చితే గెస్టులు స్టార్లు అందించవచ్చు. ఈ క్రమంలో ముకేష్, దేబ్జానీ కొత్త జంటగా కనిపించగా, వర్షిణి, నరేశ్ హోటల్ సిబ్బంది పాత్రల్లో సందడి చేయనున్నారు.
ఇక ప్రోమోలో కామెడీతోపాటు ఆసక్తికరమైన సన్నివేశాలు కూడా కనిపించాయి. నెక్లెస్‌ను కొట్టేయాలనే ప్లాన్ గురించి త్రిగుణ్ మాట్లాడుతుండగా, అమన్ కూడా ఆ వ్యవహారంలో భాగమైనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో రామ్ ప్రసాద్ వేసిన ఆటో పంచ్‌తో త్రిగుణ్ అసహనానికి గురైనట్లు ప్రోమోలో చూపించారు. మరోవైపు, స్టార్ సంపాదించేందుకు నరేశ్ నీతూను గులాబీ పువ్వుతో పోలుస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తాడు. మొదటిసారి గులాబీ పువ్వు మాట్లాడుతోందంటూ సరదాగా వ్యాఖ్యానిస్తాడు. అటు వంశీ తనను తాను డంబెల్‌గా పరిచయం చేసుకుంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలా సరదా సంభాషణలు, పాత్రల మధ్య పోటీ, నెక్లెస్ చుట్టూ సాగిన సన్నివేశాలతో బీబీ హోటల్ టాస్క్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!