

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌పై అప్పుడే గాసిప్స్ జోరందుకున్నాయి. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు వీరేనంటూ పలువురు సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. జబర్దస్త్ కమెడియన్లు రామ్ ప్రసాద్, నరేష్, యాంకర్–నటి వర్షిణి సౌందరరాజన్, నటుడు టెంపర్ వంశీతో పాటు అభిరామ్ వర్మ, ఆదిత్ ఈశ్వరన్, ముఖేష్ గౌడ, చైత్రా రాయ్, దేబ్జానీ మోదక్, కృష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ లిస్ట్ నిజమైతే ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ ఉండదనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రామ్ ప్రసాద్, నరేష్ వంటి కామెడీ నేపథ్యం ఉన్నవాళ్లు హౌస్‌లో ఉంటే సందడి మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షిణి, చైత్రా రాయ్ వంటి టీవీ నటీమణులతో పాటు టెంపర్ వంశీ, కృష్ణుడు వంటి నటులు కూడా గేమ్‌లోకి వస్తే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోవచ్చని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇవన్నీ గాసిప్స్, రూమర్స్ మాత్రమే. బిగ్‌బాస్ టీమ్ అధికారికంగా ప్రకటించే వరకు వీరి ఎంట్రీపై స్పష్టత రాదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!