

బిగ్ బాస్ తెలుగు 10లో 82వ రోజు (83వ ఎపిసోడ్) ఆసక్తికర పరిణామాలు, వాగ్వాదాలు, గ్రూప్ రాజకీయాలతో సాగింది. ఈ సీజన్‌లో చివరి కెప్టెన్‌ను ఎంపిక చేసే టాస్కులో దేబ్జానీ విజయం సాధించింది. రాం ప్రసాద్, త్రిగుణ్, వంశీ, అమన్, నరేష్ తదితరులు ఆమెకు మద్దతుగా నిలిచారు. మరోవైపు, ఆర్కేను పక్కన పెట్టడంతో కెప్టెన్సీ ఎంపికపై ఇంట్లో అసంతృప్తి వ్యక్తమైంది.
ఇక ఎపిసోడ్‌లో వర్షిణి, త్రిగుణ్ మధ్య జరిగిన వాగ్వాదం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘క్యారెక్టర్ లెస్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తన క్యారెక్టర్ గురించి త్రిగుణ్ అలా ఎలా మాట్లాడతాడని ప్రశ్నించిన వర్షిణి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, గతంలో వర్షిణి కూడా తనను బాధపెట్టేలా మాట్లాడిందని, తనకు క్షమాపణ చెప్పలేదని త్రిగుణ్ వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య గతంలో ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
వాగ్వాదం పెరగడంతో వంశీ, రాం ప్రసాద్, శివ్ తదితరులు త్రిగుణ్‌ను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, ఆవేశంలో మాట్లాడకుండా కాస్త సంయమనం పాటించాలని ముకేష్ వర్షిణికి సూచించాడు. ఈ పరిణామాల మధ్య వర్షిణి ఆట నుంచి పక్కకు తప్పుకుంది. అనంతరం రాం ప్రసాద్, వంశీ, ముకేష్, త్రిగుణ్ తదుపరి రౌండ్‌లో పోటీపడ్డారు. ఈ దశలో ముకేష్ త్రిగుణ్‌ను అడ్డుకునేలా ఆట ఆడగా, చివరకు రాం ప్రసాద్ విజయం సాధించాడు.
చివరి కెప్టెన్సీ టాస్కులో భాగంగా క్యాండీ షాప్ ఛాలెంజ్ నిర్వహించారు. ఇందులో పోటీదారులు క్యాండీలను సేకరించి తమకు మద్దతు ఇచ్చేవారి బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌లో త్రిగుణ్ సంచాలక్‌గా వ్యవహరించగా, శివ్ ఆట నుంచి బయటకు వెళ్లాడు. రెండో రౌండ్‌లో త్రిగుణ్ అమన్ బాక్సును కింద పడేయడంతో, ఆ సమయంలో సంచాలక్‌గా ఉన్న శివ్ అతడిని డిస్‌క్వాలిఫై చేశాడు. ఆ తర్వాత సంచాలక్‌గా వ్యవహరించిన అమన్ రౌండ్‌లో సుధీర్ ఎలిమినేట్ అయ్యాడు. తదుపరి రౌండ్‌లో సుధీర్ సంచాలక్‌గా ఉండగా, ఆర్కే, నరేష్ ఆట నుంచి తప్పుకున్నారు.
చివరి దశలో సంచాలక్‌గా వ్యవహరించిన ఆర్పీ.. టాస్కులో ఫిజికల్‌గా వ్యవహరించకూడదనే నిబంధన పెట్టాడు. దీనిపై ఆర్కే అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరోసారి వాదన జరిగింది. అప్పటికే దేబ్జానీని కెప్టెన్ చేయాలని పలువురు నిర్ణయించుకున్నట్లు కనిపించింది. చివరకు క్యాండీల లెక్కింపు పూర్తికాకుండానే ఆర్కేను పక్కన పెట్టి దేబ్జానీని బిగ్ బాస్ తెలుగు 10 చివరి కెప్టెన్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై శివ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఎక్కువ మంది అనుకున్నదే జరిగిందని వ్యాఖ్యానించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!