

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ కొత్త సీజన్లు సిద్ధమవుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కొత్త సీజన్లు సెప్టెంబర్ 6న ఒకేసారి ప్రారంభం కానున్నాయి. బిగ్‌బాస్ ఫ్రాంచైజీ చరిత్రలో తొలిసారిగా ఐదు భాషల్లో సీజన్లు ఒకే రోజు ప్రారంభం కానున్నట్లు జియోస్టార్ ప్రకటించింది.
కొత్త సీజన్లకు పలువురు స్టార్ హీరోలు హోస్టులుగా వ్యవహరించనున్నారు. మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగులో నాగార్జున, కన్నడలో సుదీప్, హిందీలో సల్మాన్ ఖాన్ హోస్టులుగా సందడి చేయనున్నారు. కాగా, బిగ్‌బాస్ బెంగాలీ సీజన్ 3 ఆగస్టు 31 నుంచి రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. ఈ సీజన్‌కు సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
ఇక ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు జియోస్టార్ తెలిపింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు 19.6 టీవీఆర్ నమోదవగా, ఇప్పటివరకు 36 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదయ్యాయి. బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 9 కూడా 2025 అక్టోబర్ 5న ప్రారంభమైన తొలి రోజే 150 కోట్ల వ్యూయింగ్ మినిట్స్‌ను నమోదు చేసినట్లు జియోస్టార్ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!