

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 పదో ఎపిసోడ్ ఫిజికల్ టాస్కులు, టీమ్ పోటీలు, ఎల్లో కార్డులతో ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్లను స్ట్రాంగ్, వీక్ టీమ్‌లుగా విభజించి పలు టాస్కులు నిర్వహించారు. ఈ క్రమంలో గాయత్రికి ఎల్లో కార్డు ఇవ్వడంతో పాటు రెండు టీమ్‌ల లీడర్లను ఎంపిక చేసే అవకాశం కల్పించారు. ఆమె స్ట్రాంగ్ టీమ్‌కు రోహిత్‌ను, వీక్ టీమ్‌కు దీపక్‌ను లీడర్లుగా ఎంపిక చేసింది. అనంతరం నిర్వహించిన టాస్క్‌లో తాళాలు, తాళంచెవుల సాయంతో తమను తాము విడిపించుకోవాల్సి ఉండగా.. స్ట్రాంగ్ టీమ్ విజయం సాధించింది.
విజేత టీమ్ తరఫున ఓట్ అప్పీల్‌కు రోహిత్ శ్రష్టిని ఎంపిక చేశాడు. అయితే తన వద్ద ఉన్న ‘రివర్స్ ది డిసిషన్’ కార్డును ఉపయోగించిన రాజకుమారి ఆ అవకాశాన్ని తనకు మార్చుకుంది. మరోవైపు ఆటతీరును పరిశీలించిన జ్యూరీ శ్రష్టిని మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్‌గా ఎంపిక చేసి ఆమెకు కూడా ఓట్ అప్పీల్ అవకాశం ఇచ్చింది. టాస్క్‌లో తాడును చేతులతో పట్టుకోవద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ రోహిత్ ఆ నిబంధనను ఉల్లంఘించడంతో అతడికి ఎల్లో కార్డు ఇచ్చారు. దీంతో ఎపిసోడ్ కీలక మలుపులతో ముగిసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!