
రాజకీయాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల పాత్రను పెంచే క్రమంలో ఇస్రో పాత్రను పరిమితం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. ఇస్రో స్వతంత్రత, సంస్థాగత సామర్థ్యాలపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అంతరిక్ష ప్రయోగాలు, రాకెట్లు, ఉపగ్రహాల తయారీలో ఇస్రో ప్రత్యక్ష పాత్రను క్రమంగా తగ్గించే విధానం అమల్లోకి వస్తోందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. మరోవైపు, ఇటీవలి నెలల్లో 100 మందికి పైగా ఇస్రో శాస్త్రవేత్తలు రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇస్రో నైపుణ్యం, అనుభవజ్ఞులైన సిబ్బంది కొనసాగింపుపై చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!