

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం.. సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.81 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా, పండుగ సీజన్ ప్రయోజనం కూడా లేకుండానే ఈ స్థాయి వసూళ్లు సాధించినట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రన్‌పై ఆసక్తి నెలకొంది.

పోస్టర్‌లో రవితేజ సంప్రదాయ వేషధారణలో, ఓ చిన్నారితో కలిసి ఉత్సాహభరితమైన జానపద వాతావరణంలో కనిపిస్తున్నారు. చుట్టూ కళాకారులు, పండుగ వాతావరణం ప్రతిబింబించేలా పోస్టర్‌ను రూపొందించారు. మూడు రోజుల్లోనే రూ.81 కోట్ల మార్క్‌ను దాటినట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!