
సినిమాలు

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2లో ప్రస్తుతం కార్డుల హడావుడి కొనసాగుతోంది. రాబోయే టాస్కుల్లో కంటెస్టెంట్లకు ప్రయోజనం కల్పించే ఈ ప్రత్యేక కార్డులను గెలుచుకునేందుకు పోటీలు నిర్వహిస్తున్నారు. గత అగ్నిపరీక్ష సీజన్లకు చెందిన కంటెస్టెంట్లు ఈ టాస్కులను నిర్వహించేందుకు షోలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో డీమాన్ పవన్ ఎంట్రీతో వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది. వేదికపై శ్రష్టితో కలిసి పవన్ రొమాంటిక్ డాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.
అనంతరం పవన్ ఎంచుకున్న టాస్క్‌లో శ్రష్టి, కృష్ణ పాల్గొన్నారు. ఈ పోటీలో శ్రష్టి విజయం సాధించి ‘ఫైర్ కార్డ్’ను సొంతం చేసుకుంది. ఆ కార్డును నలుగురు జ్యూరీ సభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉండగా.. శ్రష్టి నవదీప్‌ను ఎంపిక చేసింది. ఆ తర్వాత పవన్, శ్రష్టి మరోసారి కలిసి డాన్స్ చేయడంతో ఎపిసోడ్ మరింత వినోదాత్మకంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!