

బిగ్‌బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే దిశగా నడుస్తోంది. హౌస్‌లో ఇప్పటివరకు కళ్యాణ్, సుమన్ శెట్టి, తనూజ, ఇమాన్యుయేల్, భరణి, పవన్, సంజన లాంటి కాంటెస్టెంట్స్ ఉంటూనే వారం టాస్కులు జరుగుతున్నాయి. ఇప్పటికే కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్క్‌లు సీరియస్‌గా కొనసాగుతున్నాయి.
సమాచారం ప్రకారం, ఈ సీజన్ విన్నర్ మరియు రన్నర్ గురించి ఏఐ ముందే ఫైనల్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గూగుల్ ఏఐని అడిగితే, కళ్యాణ్ విన్నర్ అని, తనూజ రన్నర్ అని చూపిస్తోంది. నిజమేనా కాదా అనే విషయంలో నెటిజన్లలో షాక్, డిబేట్ కొనసాగుతోంది. తనూజ ఫ్యాన్స్ “ఆమె చాలా సమర్థంగా ఆడింది, విన్నర్ అవ్వాలి” అని అభిప్రాయం వ్యక్తం చేస్తే, కళ్యాణ్ సపోర్టర్స్ “టాస్క్‌లలో డామినేట్ చేశాడు, విన్నర్ ఖాయం” అంటూ స్పందిస్తున్నారు.
కొంతమంది ఫన్నీ మీమ్స్‌తో “బిగ్‌బాస్ టీమ్ కంటే గూగుల్ ఏఐ ముందే ఫలితం చెప్పేసింది” అని కామెంట్ చేస్తున్నారు.ఇక విన్నర్ ఫైనల్ క్లారిటీ కొద్దిరోజుల్లోనే రాబోతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!