

బిగ్‌బాస్ తెలుగు 10లో ప్రస్తుతం బడ్డీ అప్ థీమ్ కొనసాగుతోంది. డే 80 ఎపిసోడ్ 81లో భాగంగా మాజీ కంటెస్టెంట్లు డెమాన్ పవన్, రీతూ, టేస్టీ తేజ, శోభా శెట్టి ఇంట్లోకి వచ్చారు. ప్రస్తుత కంటెస్టెంట్లతో జతకట్టి వారు వివిధ టాస్కుల్లో పాల్గొన్నారు. ముందుగా ముకేష్, రీతూ, దేబ్జానీ, డెమాన్ పవన్ మధ్య జరిగిన టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఆటలో ముకేష్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ సంచాలక్ త్రిగుణ్ అభ్యంతరం తెలిపాడు. మరోవైపు పవన్, ముకేష్ తీవ్రంగా పోటీపడ్డారు. ఈ క్రమంలో పవన్ టీ షర్ట్ కూడా చిరిగిపోయింది. చివరకు డెమాన్ పవన్, దేబ్జానీ విజయం సాధించినట్లు త్రిగుణ్ ప్రకటించాడు.
ఆ తర్వాత టేస్టీ తేజ, శోభా శెట్టి ఇంట్లోకి వచ్చి స్నేహాన్ని కొనసాగించాలా, ముగించాలా అనే అంశంపై మరో టాస్క్ నిర్వహించారు. అనంతరం శోభా శెట్టి, అమన్, నరేష్ కలిసి మరో ఆటలో పాల్గొన్నారు. ఈ టాస్కుకు వర్షిణి సంచాలక్‌గా వ్యవహరించింది. అయితే నరేష్‌కు వర్షిణి ఎక్కువ అవకాశాలు ఇస్తోందని అమన్, శోభా అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు అమన్, శోభా టాస్కులో గెలిచారు. ఓటమితో నరేష్ నిరాశకు గురయ్యాడు. దీంతో ఈ ఎపిసోడ్లో దేబ్జానీ, అమన్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఇప్పటికే గత ఎపిసోడ్లో ఆర్కే, శివ్ కూడా ఈ రేసులో చోటు సంపాదించుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!