

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ చివరకు స్ట్రీమింగ్కి వచ్చింది. మనోజ్ బాజ్‌పేయి, జైదీప్ అహ్లావత్, ప్రియమణి వంటి బలమైన నటీనటులతో వచ్చిన ఈ సీజన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఈసారి కథను నిండా టెన్షన్, డ్రామాతో నింపారు. దేశ సేవ, కుటుంబ సమస్యలు ఈ రెండు మధ్య ఇరుక్కున్న శ్రీకాంత్ తివారి పాత్రను మరింత క్లిష్టంగా చూపించడం ఈ సీజన్‌కు ప్రధాన బలం. ఉత్తర–ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం తీసుకున్న “ప్రాజెక్ట్ సహకార్” చుట్టూ కథ తిరుగుతుంది. అయితే అక్కడ రుక్మ అనే క్రూర మాఫియా లీడర్ (జైదీప్ అహ్లావత్) చైనా సహకారంతో బాంబు దాడులు చేస్తూ దేశానికి భారీ ముప్పు తెస్తాడు.
ఈ నేపథ్యంలో జరిగిన దాడిలో శ్రీకాంత్ గురువు గౌతమ్ కులకర్ణి మరణించడం, తానే అనుమానితుడిగా మారడం వంటివి ప్రధాన కధాంశాన్ని ముందుకు నెడుతాయి. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడంలో, దేశ రక్షణలో, ఫ్యామిలీ సమస్యల మధ్యన అతనెట్లా పోరాడాడు అనేది సీజన్ మొత్తంని నడిపే మూల కథ.
యాక్షన్ సీన్స్ డీసెంట్‌గా ఉన్నాయి. మొదటి కొన్ని ఎపిసోడ్స్‌లో ఎమోషనల్ మూమెంట్స్ కూడా బాగా పనిచేశాయి. నటీనటుల ఎంపిక ఈసారి చాలా బలంగా ఉంది.
జైదీప్ అహ్లావత్ విలన్‌గా అద్భుతం
మనోజ్ బాజ్‌పేయి మరోసారి నేచురల్‌గా మెప్పించారు
ప్రియమణి, షరీబ్ హష్మీ, నిమ్రత్ కౌర్ పాత్రలకు శ్రద్ధగా న్యాయం చేశారు
తెలుగు నటులు రాగ్ మయూర్, రవివర్మ కనిపించడం తెలుగు ఆడియెన్స్‌కి కనెక్ట్ పెంచింది
వీరితో పాటు వచ్చిన ఒక సర్ప్రైజింగ్ క్యామియో (విజయ్ సేతుపతి) ఈ సీజన్‌కి పెద్ద అదనంగా నిలిచింది
మొదటి రెండు సీజన్స్‌లో ఉన్న గ్రిప్పింగ్ నేరేషన్ ఇక్కడ అంతగా కనిపించదు
కథనం కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది
7 ఎపిసోడ్స్‌లో మొదటి మూడు సగటుగా ఉంటాయి, 6వ ఎపిసోడ్ నుంచి పిక్ అవుతుంది
సీజన్ మొత్తం ఒక స్ట్రాంగ్ మోమెంటమ్ కొంచెం మిస్సవుతుంది
నిర్మాణ విలువలు అన్నీ బాగున్నాయి
కెమెరా వర్క్ & మ్యూజిక్ సాలిడ్
ఎడిటింగ్ ఇంకా టైట్‌గా ఉండాల్సింది
తెలుగు డబ్బింగ్ మంచి స్థాయిలో ఉంది
రాజ్ & డీకే, సుమన్ కుమార్, తుషార్ సేత్ ఈసారి డైరెక్షన్లో కలిసి పనిచేశారు. దర్శకత్వం ఓకే కానీ కథ మరింత శక్తివంతంగా ఉండాల్సింది.
“ది ఫ్యామిలీ మ్యాన్ – సీజన్ 3” మొత్తం మీద ఒక డీసెంట్ థ్రిల్లర్.
మొదటి రెండు సీజన్లంత పంచ్ లేకపోయినా, శ్రీకాంత్ పాత్ర, డ్రామా, యాక్షన్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సీజన్‌ని బాగానే నిలబెడతాయి.
ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఇది మంచి వీకెండ్ ట్రీట్ అవుతుంది.
రేటింగ్: 3/5










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!