

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా చర్చ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది — సంక్షేమ పథకాల అమలులో డెలివరీ ఉందా, లేక ఆలస్యమా? మూడో బడ్జెట్‌కు ముందుగా, రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనతో పోల్చుకుంటున్నారు. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు ఖచ్చితమైన క్యాలెండర్ ప్రకారం అమలయ్యాయి. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలో కూడా ప్రతి నెలా డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో ప్రజల్లో నమ్మకం ఏర్పడింది, ఆర్థిక చక్రం సైతం కదిలింది.
అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ వంటి భారీ హామీలతో ఓట్లు సాధించినప్పటికీ, అమలులో లోపాలు కనిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ అప్పులు, పథకాల అమలులో జాప్యం, లబ్ధిదారుల సంఖ్య తగ్గింపు, స్పష్టమైన సంక్షేమ క్యాలెండర్ లేకపోవడం వల్ల అసంతృప్తి పెరుగుతోంది. పెన్షన్లు తప్ప మిగతా హామీలు ఎక్కువగా ఆలస్యమవుతున్నాయి లేదా పరిమితంగా అమలవుతున్నాయి. రైతులు అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తుండగా, మహిళలకు భాగస్వామ్య ప్రయోజనాలే అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రోడ్ల పరిస్థితి మారలేదు, అభివృద్ధి కూడా నేలమీద కనిపించడంలేదని ప్రజలు అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ఈ జగన్ – చంద్రబాబు సంక్షేమ పోలిక రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని నిర్ణయించే అంశంగా మారుతోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!