

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ చేసిన “నేనే పవర్ సెంటర్” వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. టీవీకే విజయం తర్వాత త్రిష పేరు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుండగా, ఆమె ప్రభావంపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా విజయ్ ఇంటికి వెళ్లడం, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం, విజయ్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా కనిపించడం ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. దీంతో విజయ్ చేసిన తాజా వ్యాఖ్య పరోక్షంగా ఈ ప్రచారాలకే సమాధానమని తమిళ మీడియా చెబుతోంది.
ఇటీవల వైరల్ అయిన పాత వీడియోలో త్రిష ఒకరోజు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనే కోరికను వ్యక్తం చేసిన విషయం కూడా మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎంజీఆర్-జయలలిత కాలాన్ని గుర్తు చేస్తూ కొందరు పోలికలు తీసుకొచ్చారు. అయితే “పార్టీలో ఒక్క పవర్ సెంటర్ మాత్రమే ఉంటుంది” అనే సందేశాన్ని ప్రజలకు స్పష్టంగా ఇవ్వడానికే విజయ్ ఈ వ్యాఖ్య చేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!