

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. “బేటీ బచావో” నినాదం కేవలం మాటలకే పరిమితమా? అని ప్రశ్నిస్తూ, కేంద్ర మంత్రి కుటుంబ సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మైనర్ బాలిక పరిస్థితి, ఆమె కుటుంబంపై జరుగుతున్న వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా భద్రత, న్యాయ ప్రక్రియ ఆలస్యంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ఒక మైనర్ బాలికకు సంబంధించిన కేసులో పోలీసుల తీరుపై ఆయన విమర్శలు చేశారు. “బాధితురాలిపైనే కేసులు ఎందుకు పెట్టారు? హనీ-ట్రాప్, వసూళ్ల కేసులు ఎలా నమోదు చేశారు?” అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ను కూడా ప్రస్తావిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు చేశారు. మహిళల గౌరవం కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మైనర్ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని నేరస్తురాలిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మహిళల రక్షణ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, అవసరమైతే మళ్లీ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!