
జనరల్

పశ్చిమ బెంగాల్‌లో కొత్త మంత్రివర్గానికి శాఖల కేటాయింపు పూర్తయింది. ముఖ్యమంత్రి శుభేందు అధికారి హోంశాఖను తన వద్దే ఉంచుకున్నారు. పలు ఇళ్లల్లో పనిచేస్తూ జీవనోపాధి సాగించిన కలితా మాఝీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడు మంత్రి పదవిని అందుకున్నారు. ఆమెకు గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
తూర్పు వర్ధమాన్ జిల్లాలోని ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కలితా మాఝీ, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,535 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు జర్నలిస్ట్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన స్వపన్ దాస్‌గుప్తాకు ఆర్థిక శాఖ కేటాయించారు. తపస్ రాయ్‌కు పరిశ్రమలు, దిలీప్ ఘోష్‌కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అగ్నిమిత్ర పాల్‌కు పట్టణాభివృద్ధి, డాక్టర్ శరద్వత్ ముఖర్జీకి ఆరోగ్య శాఖ వంటి కీలక బాధ్యతలు అప్పగించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!