
సినిమాలు
నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు. గత ప్రభుత్వ ప్రభావాల నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. తక్కువ ఆదాయం, ఎక్కువ ఖర్చులు అనే పరిస్థితి వారసత్వంగా వచ్చిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.
ఇంకా రెండు నుంచి మూడు సంవత్సరాల్లో అమరావతికి స్పష్టమైన రూపు వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అమరావతి రహదారులను జాతీయ రహదారులతో కలుపుతున్నామని తెలిపారు. పశ్చిమ బైపాస్ వల్ల రాకపోకలు పెరిగాయని, ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ పూర్తయితే అభివృద్ధి వేగం మరింత పెరుగుతుందని సీఎం అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!