

విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా దాదాపు రూ.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని, తద్వారా సుమారు 11 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సుకు మంత్రులంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా దాదాపు 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. వచ్చే జనవరిలో సహకార ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సొసైటీ, పంచాయతీ, సహకార ఎన్నికలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఎన్నికలు ముగిసిన వెంటనే పాలనను తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రతి కేబినెట్ సమావేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై చర్చించాలని నిర్ణయించారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే కూరగాయల ధరలు కొంతమేర తగ్గాయని మంత్రులు వివరించగా.. బియ్యం ధరలు కూడా తగ్గేలా చూడాలని సీఎం సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!