

జోసెఫ్ విజయ్ మే 10న చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీవీకే కూటమి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించడంతో ఈ వేడుక చారిత్రాత్మక ఘట్టంగా మారింది. అయితే విజయ్ భార్య సంగీత, కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా వేడుకకు హాజరుకాకపోవడం అభిమానుల్లో భావోద్వేగాన్ని రేకెత్తించింది. విజయ్ తల్లిదండ్రులు ఎస్. ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ మాత్రం కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.
విజయ్ కుటుంబ సభ్యుల గైర్హాజరు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘట్టం భావోద్వేగంగా ఉందని, అసంపూర్ణంగా అనిపించిందని అభిమానులు పోస్టులు పెట్టారు. ఇదే సమయంలో త్రిష కృష్ణన్ కార్యక్రమానికి హాజరై విజయ్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడటం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుటుంబ అంశాలపై చర్చలు జరిగినప్పటికీ, విజయ్ తొలి ఎన్నికల ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా అవతరించడం తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!