
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కే. ఏ. సెంగొట్టైయన్ను ఆహ్వానించి, తన కుర్చీలో కూర్చోబెట్టిన తీరు అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా, విజయ్ వినయం, పెద్దల పట్ల గౌరవం, నాయకత్వంలో ఉన్న సంస్కారం అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రాజకీయాల్లో చిన్న చిన్న చర్యలకే పెద్ద అర్థాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ చేసిన ఈ గౌరవప్రదమైన చర్య పరస్పర గౌరవానికి, సంస్కారానికి ప్రతీకగా నిలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో చూసిన అత్యంత హృద్యమైన రాజకీయ క్షణాల్లో ఇదొకటిగా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!