

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియలో టీవీకే అధినేత విజయ్ వ్యూహాత్మక పొరపాటు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తొలుత టీవీకేకు చెందిన 108 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మాత్రమే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు లేఖ సమర్పించి ఉంటే.. అతిపెద్ద ఏకైక పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కలిగేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే విజయ్ ముందుగానే కాంగ్రెస్తో పాటు చిన్న పార్టీల మద్దతు కోరారు. ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో మే 6న సమర్పించిన లేఖలో వారి సంతకాలను కూడా చేర్చారు. దీంతో 112 మంది సభ్యులతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నంగా గవర్నర్ భావించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తిరిగి రావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాత్మక తప్పిదం వల్లే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం ఆలస్యమైనట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!