

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆదివారం ఇన్స్టాగ్రామ్ పై ఆరోపణలు చేసింది. తమ అగ్రనేత రాహుల్ గాంధీ, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని పేర్కొంది. కేంద్ర ఐటీ శాఖ నిబంధనల వల్లే ఇలా జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.
ఆదివారం చెన్నైలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాంగ్రెస్ నేత శ్రీవత్స ఈ విషయాన్ని ఎక్స్‌లో ప్రస్తావిస్తూ, ఇన్స్టాగ్రామ్ ఫొటోలను బ్లాక్ చేసిందని, కొంతసేపు రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఖాతాలు కనిపించలేదని తెలిపారు.
ఇది ప్రతిపక్ష నేతల గళాన్ని అణచివేసే ప్రయత్నమని కాంగ్రెస్ విమర్శించింది. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఖండిస్తూ, తమవల్ల అలాంటి చర్యలు ఏవీ తీసుకోలేదని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!