
జనరల్

నెక్లెస్‌రోడ్ రోటరీ వద్ద గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు ఆలస్యంగా హాజరయ్యారు. కార్యక్రమం ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి నమస్కరించి, తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు సీఎం ప్రతి నమస్కారం చేస్తూ, తాను నాగర్‌కర్నూల్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, సమయం లేదని వివరించారు.
అయినప్పటికీ హనుమంతరావు తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. సమావేశం ముగిసిన అనంతరం వందన సమర్పణ పేరుతో మాట్లాడేందుకు అవకాశం సంపాదించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లాల్సిన తొందరలో ఉన్నప్పటికీ, తన ప్రసంగానికి అవకాశం దక్కించుకోవడం సమావేశంలో ఆసక్తికర పరిణామంగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!