

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఉన్న అధిక సుంకాలను తగ్గించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వాషింగ్టన్–న్యూఢిల్లీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌పై 50 శాతం సుంకాలు అమలులో ఉన్నాయని, ఇవి రష్యా చమురు కొనుగోలుతో పెరిగినవని ట్రంప్ తెలిపారు. భారత్ రష్యా చమురు దిగుమతులను తగ్గించిందని, అందువల్ల సుంకాలను తగ్గించబోతున్నాం, అని ఆయన వైట్‌హౌస్ సమావేశంలో చెప్పారు. సెర్జియో గోర్ అనే వ్యక్తి అమెరికా రాయబారిగా భారత్‌లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి, అని అన్నారు.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ట్రంప్ అభివర్ణించారు. వాణిజ్య నిపుణులు భారతదేశానికి కనీసం 15 శాతం సుంక రాయితీ అవసరమని చెబుతున్నారు. చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీలో నిలవడానికి ఇది అవసరమని సూచిస్తున్నారు. ఇక, భారత్–అమెరికా మధ్య శక్తి రంగ సహకారం కూడా మరింత పెరగనుంది. వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ శక్తి భద్రతలో అమెరికా పెద్ద పాత్ర పోషించనుంది, అని తెలిపారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (1)
“భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలు కొత్త దశలోకి అడుగేస్తున్నాయి!”