

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ యాదవ్కు సీఎం రేవంత్ వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సీనియర్ కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
యాదవ సమాజానికి ఎంతో ప్రియమైన ‘సదర్’ పండుగను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డిని అఖిలేష్ యాదవ్ ప్రశంసించారు. ఈ నిర్ణయాన్ని యాదవులు దేశవ్యాప్తంగా ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి యాదవుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో యాదవ వర్గానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రికి అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!