

రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని బీఆర్ఎస్ నేతలే నిజమైన బట్టేబాజ్లు అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి రైతు మేళాలో పాల్గొన్న ఆయన, గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయిందని ఆరోపించారు. రైతులపై వేల కోట్ల వడ్డీ భారం మోపడంతో ప్రజలు ఆ పార్టీని ఎన్నికల్లో తిరస్కరించారని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి, 22 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా జమ చేసిందని తుమ్మల వివరించారు. యూరియా కొరతపై విమర్శలు చేస్తున్న వారిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల మధ్య కూడా రాష్ట్రానికి అవసరమైన ఎరువులను అందించామని తెలిపారు. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, రైతుల సమస్యలను రాజకీయ లాభాలకు వాడుకునే ప్రయత్నాలను ప్రజలు గుర్తిస్తారని మంత్రి అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!