
క్రీడలు

భాను ప్రకాష్ రెడ్డి తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సనాతన ధర్మాన్ని నిర్మూలించడం ఎవరి తరం కాదు” అంటూ వ్యాఖ్యానించిన ఆయన, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ నాయకులు మాట్లాడకూడదని హెచ్చరించారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకు ఎదురైన ఇబ్బందులకు ఇలాంటి వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు.
అలాగే ఈ అంశంపై విజయ్ మౌనం పాటించడం ఆశ్చర్యానికి గురి చేసిందని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యల వల్లే డీఎంకేకు రాజకీయ నష్టం జరిగిందని, ఉదయనిధి స్టాలిన్ కారణంగానే పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయని విమర్శించారు. హిందువుల భావోద్వేగాలను గౌరవించాలని, మతపరమైన అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాజకీయ నాయకులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!