
జనరల్

ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. రాజీకి రావడానికి ఇరాన్‌కు ఎక్కువ సమయం లేదని, త్వరగా నిర్ణయం తీసుకోకపోతే చివరకు వారికి ఏమీ మిగలదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఇరాన్‌పై అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నట్లు సూచించే ఫొటోను కూడా షేర్ చేశారు. ఆయన వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ సంబంధాలపై ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరికలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!