

మాజీ వైసీపీ ఎంపీ భరత్‌పై ఇప్పుడు ఉచ్చు బిగుస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయి. 2019లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన భరత్, 2024లో ఓటమి తర్వాత కూటమి ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా భరత్‌కు అత్యంత సన్నిహితుడిగా పని చేసిన రామశర్మ మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనం రేపాయి. భరత్ గతంలో చేసిన చీకటి దందాలకు తానే సాక్షినని, ఆ కారణంగా తన ప్రాణానికే ముప్పు ఏర్పడిందని శర్మ ఆరోపించాడు. టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలోకి తీసుకురావడం, పేపర్ మిల్లు యూనియన్ నాయకులను లాగడం, రెడ్ గ్రావెల్ మైనింగ్, ఇసుక ర్యాంపులపై నెలకు ఐదు కోట్ల వరకు వసూళ్లు జరగడం వంటి అంశాలను బహిర్గతం చేశాడు. పార్టీ కోసం తాను కూడా బాగా ఖర్చు పెట్టినట్టు చెప్పాడు.
ఈ ఆరోపణలను రాజమండ్రి శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసులు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం పరిస్థితి చూస్తుంటే… భరత్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున విచారణ, చర్యలు జరగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!