

నక్సల్స్ హింసాకాండకు గిరిజనులే ఎక్కువగా బలయ్యారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో వారిని కనీసం ఓటు కూడా వేయనివ్వలేదన్నారు. గిరిజన సమరయోధుడు బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం మహారాష్ట్రలోని గచ్చిరోలిలో నిర్వహించిన ‘జనజాతీయ గౌరవ దివస్’ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.
‘గత ప్రభుత్వాలు ఆదివాసీలను గాలికొదిలేశాయి. మావోయిస్టులు చిన్న పిల్లలను, గిరిజన యువమహిళలను అపహరించుకుపోయినప్పుడు మౌనం దాల్చాయి. గిరిజనులను వారు ఓట్లు వేయనివ్వకపోయినా మాట్లాడలేదు. కళ్లుమూసుకుని కూర్చుండిపోయారు. ఇప్పుడు మావోయిస్టుల హింసను రూపుమాపాక పరిస్థితుల్లో మార్పు వస్తోంది. భద్రత నెలకొనడంతో గిరిపుత్రుల తల్లులు, సోదరీమణులు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. హింసాకాండతో బాల్యాన్ని కోల్పోయిన పిల్లలు ఇప్పుడు విద్య, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు’ అని తెలిపారు. గత 12 ఏళ్లలో సుమారు 50 కోట్ల మంది అతి పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత భారత్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటని తెలిపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!