

ఇండిగో విమాన సంస్థలో ఏర్పడిన సంక్షోభానికి కారణం ఆ కంపెనీ అంతర్గత సమస్యలేనని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పైలట్ల రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమానాలు రద్దవుతున్నాయని, ఇది ఇండిగో సొంత నిర్వహణ లోపమేనని రాజ్యసభలో ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌డిటిఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) నిబంధనలను అమలు చేసిన తొలి నెల వరకు అన్నీ సజావుగానే నడిచాయని, డిసెంబర్ 3 నుంచి మాత్రమే సమస్య తలెత్తిందని ఆయన గుర్తు చేశారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యంపై తాను బాధపడుతున్నానని మంత్రి తెలిపారు.
వీలైనన్ని ఎక్కువ విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ఈ సంక్షోభం కారణంగా ఇప్పటివరకు 5,86,700 టికెట్లు రద్దయ్యాయని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. టికెట్ ధరలు అమాంతంగా పెరగకుండా ప్రభుత్వం గట్టి పర్యవేక్షణ చేపట్టిందని, ధరలపై పరిమితులు విధించామని ఆయన స్పష్టం చేశారు. ఇండిగో సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)













.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!