
క్రీడలు

అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన ప్రభుత్వ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమది మతపరమైన భేదాలు లేని ప్రభుత్వం అని, సామాజిక న్యాయానికి కట్టుబడి ప్రజలకు పారదర్శక పాలన అందిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇంకా తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లపాటు కొనసాగుతుందని సీఎం విజయ్ ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల కోసం కూడా ప్రభుత్వం సమానంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!