

జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వివిధ పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థ ప్రముఖులను సమన్వయంతో పార్టీలోకి ఆహ్వానించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చేరికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 14 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించారు.
ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను సహా పలువురు సీనియర్ నేతలు సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం కమిటీ సభ్యులతో సమావేశమై చేరికలపై దిశానిర్దేశం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!