

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగానికి మంత్రి నారా లోకేష్ కొత్త ఊపు తెచ్చారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన ఓ అద్భుతమైన అవకాశం కల్పించారు. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతికతలపై అవగాహన పెంచుకునేందుకు 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు సింగపూర్ పర్యటనకు పంపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై జరిగిన సమీక్షలో లోకేష్ మాట్లాడుతూ, “సింగపూర్‌లోని ప్రముఖ పాఠశాలలను సందర్శించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేయండి. మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడే సూచనలు సమర్పించండి” అని ఉపాధ్యాయులను కోరారు. గతంలో ఫిన్లాండ్, సింగపూర్‌లకు ఉత్తమ ఉపాధ్యాయులను పంపాలని లోకేష్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది.
ఇక మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 100 మంది విద్యార్థులు ఢిల్లీకి విద్యా యాత్రకు బయలుదేరారు. వారు నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్లను సందర్శించి సైన్స్, టెక్నాలజీ అంశాలపై ప్రాయోగిక అవగాహన పొందనున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, “ఈ యాత్ర ద్వారా కొత్త జ్ఞానం, అనుభవాలు సొంతం చేసుకోండి” అంటూ ట్వీట్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!